News August 7, 2024

NZB మాల్‌లో యువతి పట్ల బాలుడి అసభ్య ప్రవర్తన

image

నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ పక్కనే ఉన్న మాల్‌లో ఓ యువతి పట్ల పదహారేళ్ల బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిఫ్టులో నుంచి బయటకు వెళ్లే సమయంలో యువతి చేయి పట్టుకుని లాగాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా సదరు యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు బాలుడికి మతిస్థిమితం బాగాలేదని గుర్తించారు.

Similar News

News December 31, 2025

90 కేసుల్లో 211 మంది అరెస్ట్: నిజామాబాద్ CP

image

డ్రగ్స్ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరించామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జిల్లాలో 2025లో 90 కేసులు నమోదుకాగా మొత్తం 211 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. 15,644 కిలోల గంజాయి, 35,960 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. గతేడాది 23 డ్రగ్స్ కేసులు నమోదు కాగా ఈ 2025 90 కేసులు నమోదయ్యాయని వివరించారు.

News December 31, 2025

NZB: నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి నేపథ్యమీదే!

image

నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా నియమితులైన ఇలా త్రిపాఠి UP లక్నోకు చెందిన వారు. ఢిల్లీలోని జేపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2013లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో చదివారు. రెండో అటెంప్ట్‌ 2017లో సివిల్స్ సాధించారు. ఆమె భర్త భవేశ్ మిశ్రా కూడా IAS అధికారి. ఆమె ములుగులో పని చేసి టూరిజం డైరెక్టర్‌గా వెళ్లారు. తదుపరి నల్గొండ కలెక్టర్‌గా పని చేశారు.

News December 31, 2025

NZB: మందుబాబులకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

image

మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించేది లేదని ఫైన్, జైలు శిక్షకు గురికాక తప్పదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యూయర్ వేడుకల్లో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మద్యం తాగి రోడ్ల మీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన ఫైన్‌తో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.