News July 1, 2024

NZB: మురుగు కాలువలలో పడి యువకుడి మృతి

image

నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 3, 2024

ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్

image

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

News July 3, 2024

పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

image

‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.

News July 2, 2024

ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు: బాలరాజు

image

పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.