News January 17, 2026
NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్‌కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.
Similar News
News February 14, 2026
NZB: 16న మేయర్ ఎన్నిక కోసం ఏర్పాట్లు

ఈ నెల 16న (సోమవారం) నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. NZB ACP ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కాగా మొదట మేయర్ ఎన్నిక జరుగుతుంది. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది.
News February 14, 2026
NZB: మేయర్ బరిలో బీసీ అభ్యర్థులు..!

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.
News February 14, 2026
దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.


