News March 15, 2025

NZB: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టులు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

Similar News

News March 15, 2025

NZB: మనవడి బర్త్‌డే.. తాత సూసైడ్

image

NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్‌డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2025

NZB: జేఎల్‌గా ధరణీ శంకర్

image

రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ల నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా వాజిద్ నగర్ గ్రామానికి చెందిన ధరణి శంకర్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా నియామకం పొందాడు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్థులు, ప్రిన్సిపల్ అభినందించారు.

News March 15, 2025

NZB: గ్యాస్ స్టవ్ పేలి వాచ్‌మెన్ మృతి

image

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో నాలుగేళ్లుగా వాచ్‌మెన్‌గా పని చేసే కోట్ల అనంత్(52) ఈ నెల 6న టీ పెట్టుకునేందుకు స్టవ్ ముట్టించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం చికిత్స పొందుతూ అనంత్ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా దిబ్బిడి గ్రామం అని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!