News December 31, 2024

NZB: యువకుడిపై అత్యాచారం కేసు నమోదు

image

సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్‌కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు SHO వెల్లడించారు.

Similar News

News November 8, 2025

KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News November 8, 2025

పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025