News March 30, 2025

NZB: యువకుడి ఆత్మహత్యాయత్నం

image

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు NZBలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు.

Similar News

News April 1, 2025

NZB:రేపు ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి U-20 మహిళా, పురుషుల రెజ్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల డిఎస్ఏ స్విమ్మింగ్ రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనేవారు ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ వెంట తేవాలన్నారు.

News April 1, 2025

NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

image

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.

News April 1, 2025

నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగ

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మోస్రాలో 41.5℃, ఎడపల్లి 41.4, పెర్కిట్ 41.4, కోటగిరి 41.4, నిజామాబాద్ 41.3, గోపన్నపల్లి 41.3, వేంపల్లి 41.2, వైల్పూర్ 41.1, మెండోరా 41.1, ధర్పల్లి 41, మగ్గిడి 40.9, మోర్తాడ్ 40.8, రెంజల్ 40.7, ఇస్సాపల్లి 40.6, చిన్నమావంది 40.6, జక్రాన్‌పల్లి 40.6, కమ్మర్‌పల్లి 40.5, మదనపల్లి 40.5, సాలూర 40.3, భీమ్‌గల్ 40.3, కొండూరు 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!