News April 1, 2025
NZB: రాజీవ్ యువ వికాసంపై అవగాహన: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పథకానికి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామన్నారు.
Similar News
News April 2, 2025
రుద్రూర్: యువకుడి అదృశ్యం

రుద్రూర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
News April 2, 2025
NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 2, 2025
నిజామాబాద్ జిల్లా ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఎడపల్లిలో 39.6℃, మంచిప్ప, గోపన్నపల్లి, నిజామాబాద్, కోటగిరి 39.5, మదనపల్లి, చిన్న మావంది 39.4, మల్కాపూర్ 39.3, పెర్కిట్, మోస్రా 39.2, సాలూరా 39.1, రెంజల్, కల్దుర్కి 38.7, వేల్పూర్, వెంపల్లె 38.6, లక్మాపూర్, చింతలకొండూర్, ముప్కల్, యర్గట్ల 38.4, చందూర్, బాల్కొండ 38.3, పోతంగల్ 38, జక్రాన్‌పల్లి, రుద్రూర్, జకోరా 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది.