News December 24, 2025

NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.

Similar News

News December 26, 2025

NZB: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 19వ తేదీన ఆస్పత్రి మెయిన్ గేటు పక్కన గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదురు వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-49 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.

News December 26, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్స్‌ నిజామాబాద్ జిల్లా వాసులు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సాయిలు టెక్నికల్ అఫీషియల్స్‌గా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరగనున్న 72వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్-2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పట్ల ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తదితరులు అభినందించారు.