News May 7, 2025

NZB: రాహుల్ గాంధీకి MLC కవిత సెటైరికల్ WELCOME

image

రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Xలో ఎద్దేవా చేశారు. “దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ పేర్కొన్నారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారన్నారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రశ్నలు సంధించారు.

Similar News

News July 5, 2025

ట్రిపుల్ఐటీకి 14 మంది బెజ్జోరా పాఠశాల విద్యార్థులు

image

భీమ్‌గల్ మండలం బెజ్జోరా ఉన్నత పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీకి ఎంపిక చేస్తారు. శుక్రవారం సాయంత్రం విడుదలైన బాసర ఆర్జీయూకేటీ ఫలితాల్లో ఒకేసారి 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్ అన్నారు. ఉపాధ్యాయ బృందానికి మండలంలోని పలువురు టీచర్స్ అభినందనలు తెలిపారు.

News July 4, 2025

NZB: రెండు రోజుల పసికందు విక్రయం

image

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.

News May 7, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

image

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.