News October 23, 2025
NZB: రియాజ్ పై కాల్పుల విచారణ అధికారిగా ఎల్లారెడ్డి DSP

రియాజ్ పై కాల్పుల ఘటనపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్‌రావు విచారణ అధికారిగా నియమితులయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి విచారణ అధికారిని నియమించారు. HRC నవంబర్ 24లోపు నివేదికను కోరిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అన్నది తేల్చేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ రంగంలోకి దిగారు. బుధవారం జీజీహెచ్ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌రావు పరిశీలించి విచారణ జరుపుతున్నారు.
Similar News
News October 23, 2025
BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ పరిధి యమ్నంపేట్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.
News October 23, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కాకినాడ కలెక్టర్ సూచనలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం వాయుగుండంగా మారుతుందని కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పరిస్థితులను సమీక్షించేందుకు కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, అవి 27వ తేదీ వరకు పనిచేస్తాయని చెప్పారు. సహాయం కోసం 0884-2356801 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.