News October 19, 2025
NZB: రియాజ్ EXCLUSSIVE PHOTO

NZBలో కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలపై సీపీ సాయి చైతన్య ఖండించారు. సారంగపూర్‌లో నిందితున్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఆసిఫ్ అనే వ్యక్తిపై హత్య చేయడానికి ప్రయత్నించగా అక్కడ జరిగిన పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు రియాజ్‌ను పట్టుకుని, ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియాజ్ EXCLUSSIVE PHOTO Way2Newsకు దొరికింది.
Similar News
News October 19, 2025
ఇంద్రవెల్లి: దండారీ ఉత్సవాలు పాల్గొన్న ADB ఎస్పీ

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్‌పెన్‌కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు. గుస్సాడీలతో కలసి కోలాటం ఆడుకున్నారు.
News October 19, 2025
నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

నంద్యాల సమీపంలోని చిన్నచెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఆదివారం రాత్రి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన హుసేన్ బాష మృతిచెందగా, బుక్కాపురం గ్రామానికి చెందిన మల్లేశ్, సువర్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
NGKL: ఆ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ వధించిన రోజు దీపావళి అన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.