News March 3, 2025

NZB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్

image

నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ACBదాడి జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. రామరాజు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ DSP శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు సోదాలు పూర్తయ్యాక ప్రకటిస్తామని DSP తెలిపారు.

Similar News

News March 3, 2025

NZB: బాధ్యతలు తీసుకున్న జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి

image

ఇటీవల జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నియమించిన IAS అధికారిణి భవాని సోమవారం నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 3, 2025

NZB: కొడుకులు, కోడళ్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

నవీపేట్ మండలం కోసి ఫకీరాబాద్ గ్రామానికి చెందిన గుడ్డి ముత్తమ్మ అనే వృద్ధురాలు కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని సోమవారం ప్రజావాణిలో నిజామాబాద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భర్త చనిపోతే అక్కున చేర్చుకుని కడుపు నింపాల్సిన కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దేవాలయం ఎదుట కూర్చుని యాచిస్తూ జీవనం సాగిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

News March 3, 2025

NZB: అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB తనిఖీలు

image

నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ సబ్ రిజిస్ట్రార్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. అర్బన్ కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు పని చేస్తున్నారు. కాగా తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.

error: Content is protected !!