News March 28, 2024
NZB: రైళ్లలో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష
రైళ్లలో సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.
Similar News
News January 11, 2025
చింతకుంట అటవీ ప్రాంతంలో ఆవు పై చిరుత పంజా
మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజ్జి నారాయణ ఆవులు మేత మేయడానికి వెళ్లగా చిరుత ఆవుపై దాడి చేసింది. పెంపుడు కుక్కలు అరవడంతో ప్రాణాలతో బయట పడ్డట్టు బాధితుడు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్టు గతంలో గుర్తించినట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ హుస్సేన్ తెలిపారు. కాపరులు గుట్ట పైకి వెళ్ల కూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News January 11, 2025
NZB: కుళ్ళిన మృతదేహం లభ్యం
వర్ని మండలం అఫంధి ఫారం డంపింగ్ యార్డ్ పరిధిలో చందూర్ వైపు వెళ్తుండగా నిజామాబాద్ వర్ని ప్రధాన రోడ్డుకు ఎడమ వైపున కొద్ది దూరంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. గత 20 నుంచి 25 రోజుల కిందట మరణించి ఉంటాడని అఫంది ఫారం గ్రామానికి చెందిన రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
News January 11, 2025
రాజంపేట్: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
రాజంపేట్ మండలం అర్గోండలో అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజశేఖర్(27) గతంలో జీవనోపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు.