News September 21, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వర్నిలోని ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌కు చెందిన అజార్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అజార్‌ను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 21, 2025
NZB: 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించాం: TPCC చీఫ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించినట్లు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గ్రంథాలయ నూతన భవనం, జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల కోసం ఓల్డ్ డీఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం లైబ్రరీలో నిరుద్యోగులతో మాట్లాడారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 20, 2025
నిజామాబాద్: MLHPలకు ప్రాక్టికల్ పరీక్షలు

సీపీసీహెచ్లో భాగంగా మెడికల్ ల్యాబ్ హెల్త్ ప్రాక్టీషనర్ (MLHP)లకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది MLHPలు హాజరయ్యారని చెప్పారు. మౌఖిక పరీక్షలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులను కేటాయించినట్లు తెలిపారు. ఎగ్జామినర్‌గా డాక్టర్ నిరూప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారిగా డా.రాజు వ్యవహరించారు.
News September 20, 2025
NZB: అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 విరాళం

ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.