News June 1, 2024

NZB: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

NZB జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మోర్తాడ్‌కు చెందిన నర్సయ్య(63) ఆర్మూర్ శివారులో లారీ ఢీ కొని మృతి చెందాడు. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లికి చెందిన ఆశన్న(65) టిప్పర్ టైర్ కింద పడి మృతిచెందాడు. మోర్తాడ్‌లోని దొన్కల్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తున్న లారీ ఢీకొని వినయ్(16) మృతి చెందగా.. మోండోరాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నాగేంద్ర(25) మృతి చెందాడు.

Similar News

News February 12, 2025

చిలుకూరు బాలాజీ అర్చకుడికి దాడిలలో బోధన్ యువకుడు

image

హిందువులను రక్షించడానికి ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ రామరాజ్యం ఆర్మీలో బోధన్‌కు చెందిన సాయినాథ్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. రంగరాజన్‌పై దాడి ఘటనలు పోలీసులు సాయినాథ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా 2022 నుంచి పని చేస్తున్నాడు. ఇదే విషయమై ఇంకా ఎవరినైనా బెదిరించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

News February 12, 2025

త్వరలో NZBలో ఎన్నికలు.. MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

image

✓ బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోవాలి.✓ వెళ్ళేటపుడు మీ ఐడీ కార్డు తీసుకొని వెళ్ళాలి.✓ బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.✓ పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.✓ మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంటాయి.✓ మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి.✓ ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు వేయవచ్చు.

News February 12, 2025

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 24 మందికి జరిమానా

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, 24 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 24 మందికి రూ.36,000 జరిమానా విధించి ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

error: Content is protected !!