News September 2, 2025

NZB: ‘లోకల్ దంగల్’లో ముందుగా ZPTC, MPTC ఎన్నికలు..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ZPTC సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, MPTC సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

Similar News

News September 2, 2025

SRSP UPDATE

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు 29 గేట్ల ద్వారా 1.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 29 వరద గేట్ల నుంచి కాకుండా ఇందిరమ్మ కాల్వ ద్వారా 18 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 4500 క్యూసెక్కులు వెరసి మొత్తం 1,51,897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా 1090 (76.894TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

NZB: ‘లోకల్’ దంగల్..!

image

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లాలోని NZB, BDN, ARMR డివిజన్లలోని 31 మండలాల్లో ఉన్న 545 GPలు, 5,022 వార్డులు, 5,053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.

News September 1, 2025

SRSP UPDATE

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు 25 స్పిల్వే వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 1,26,853 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.