News March 9, 2025
NZB: లోక్ అదాలత్‌లో 18,252 కేసుల పరిష్కారం

లోక్ అదాలత్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 18,252 కేసులను పరిష్కరించినట్లు DLSA సూపరింటెండెంట్ శైలజ తెలిపారు. 14 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయగా, కేసుల పరిష్కారంతో రివార్డు రూపంలో రూ.5.34 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కేసుల కంటే 4,500 పైగా ఎక్కువ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు.
Similar News
News March 9, 2025
NZB: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ(62) ఒక షోరూంలో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేసి ఇంటికి బైక్‌పై వెళుతుండగా త్రిమూర్తి ఎదురుగా మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.
News March 9, 2025
NZB: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో మెరిగే కవిత(43) అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. ఆమె కుమారుడు పూల వ్యాపారం చేసి నష్టపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కుమారుడు నష్టపోయిన విషయంలో కవిత మనస్తాపానికి గురైందన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు.
News March 9, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం తూమ్పల్లి, కోటగిరిలో 39.7℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేంపల్లి 39.5, ఆలూరు 39.4, లక్ష్మాపూర్ 39.3, గోపన్నపల్లి 39.2, ముప్కల్ 39.1, మోర్తాడ్ 38.9, మల్కాపూర్, జక్రాన్‌పల్లి 38.8, కోనసముందర్ 38.4, బాల్కొండ 38.3, మాచర్ల, మదన్‌పల్లె, వైల్పూర్ 38.2, జనకంపేట్, భీంగల్ 38.1, నిజామాబాద్ 38, పెర్కిట్, యేర్గట్లలో 37.9℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.