News May 14, 2024

NZB: వచ్చే నెల 4 వరకు నిరీక్షించాల్సిందే..!

image

లోక్‌సభ పోరు ముగిసింది. ఓటరు తీర్పు EVMలలో నిక్షిప్తమైంది. రాజకీయపార్టీలు నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. తుది తీర్పు కోసం ఓటర్ల నిర్ణయంపై ఆధారపడ్డాయి. ZHB స్థానంలోని 16,41,410 మంది ఓటర్లు 19 మంది అభ్యర్థులు, NZB పరిధిలోని 17,04,867 ఓటర్లు 29 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. అధికారులు EVMలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. విజేత ఎవరో తేలాలంటే వచ్చే నెల 4వ వరకు నిరీక్షించాల్సిందే..

Similar News

News April 14, 2026

నిజామాబాద్: జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

image

నిజామాబాద్ ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. హెచ్‌పీవీ టీకాలు, డెంగీ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.

News April 14, 2026

NZB: టాస్‌ (TOSS) పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో SSC, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలు, టైమ్ టేబుల్ సిద్ధంగా ఉన్నాయన్నారు.

News April 14, 2026

ఇందల్వాయి: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ఇందల్వాయి మండలం గంగారం తండా సమీపంలో ఎన్‌హెచ్-44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా గంగార తండా శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.