News March 9, 2025

NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

image

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదుతో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News March 9, 2025

NZB: లోక్ అదాలత్‌లో 18,252 కేసుల పరిష్కారం

image

లోక్ అదాలత్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 18,252 కేసులను పరిష్కరించినట్లు DLSA సూపరింటెండెంట్ శైలజ తెలిపారు. 14 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయగా, కేసుల పరిష్కారంతో రివార్డు రూపంలో రూ.5.34 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కేసుల కంటే 4,500 పైగా ఎక్కువ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు.

News March 9, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం తూమ్పల్లి, కోటగిరిలో 39.7℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేంపల్లి 39.5, ఆలూరు 39.4, లక్ష్మాపూర్ 39.3, గోపన్నపల్లి 39.2, ముప్కల్ 39.1, మోర్తాడ్ 38.9, మల్కాపూర్, జక్రాన్‌పల్లి 38.8, కోనసముందర్ 38.4, బాల్కొండ 38.3, మాచర్ల, మదన్‌పల్లె, వైల్పూర్ 38.2, జనకంపేట్, భీంగల్ 38.1, నిజామాబాద్ 38, పెర్కిట్, యేర్గట్లలో 37.9℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 9, 2025

NZB: పాఠ్యాంశంగా రమేశ్ కార్తీక్ నాయక్ కవి పద్యం

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఆంగ్లంలో రాసిన’లైఫ్ ఆన్ పేపర్ ‘అనే కవితను బళ్ళారి (కర్ణాటక) శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లిష్ – మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇది ఒక గాఢమైన భావోద్వేగ కవిత అని దీనిని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!