News March 2, 2025

NZB: వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్నును ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు నూరు శాతం వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేవించారు.

Similar News

News March 3, 2025

NZB: పానీపూరి తిని కత్తితో దాడి

image

ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్‌ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.

News March 3, 2025

సిరికొండ : సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారిణి

image

సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణి మమత ఎన్నికైనట్లు అధ్యాపకులు తెలిపారు. ఇటీవల జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్ హాకీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి హాకీ పోటీలు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పలువురు అభినందించారు.

News March 2, 2025

NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమం తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

error: Content is protected !!