News August 13, 2025
NZB: విజయవాడ ఇంద్రకీలాద్రిపై TPCC అధ్యక్షుడు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారినిTPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్న రాత్రి మహేష్ కుమార్ గౌడ్ మోపిదేవిలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు.
Similar News
News August 13, 2025
SRSPకి 12,769 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అల్పపీడన ద్రోణితో వర్షాలు కురుస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడం లేదు. బుధవారం మధ్యాహ్నం 12,769 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రాగా సాయంత్రం 6.30 గంటలకు కూడా అంతే మొత్తంలో నీరు ఎగువ నుంచి వస్తోంది. దిగువకు 4,163 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,080 అడుగులు(45.161TMC)లకు నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
News August 13, 2025
NZB: కలెక్టరేట్లో అధికారులతో ఎంపీ అర్వింద్ సమీక్ష

నిజామాబాద్ కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎంపీ అర్వింద్ ధర్మపురి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే, ఆర్అండ్బీ, నేషనల్ హైవే, ఇతర శాఖల కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు.
News August 13, 2025
NZB: జిల్లా ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: CP

రానున్న 2-3 రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24X7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 (లేదా), పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59700కు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.