News February 28, 2026

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

image

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.

Similar News

News March 2, 2026

NZB: జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోళీ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

News March 2, 2026

డిచ్‌పల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విక్రమ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కి చెందిన జగన్నాథం శనివారం దూస్‌గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చాడు. ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2026

NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.