News July 17, 2024

NZB: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

image

భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతిచెందిన ఘటన బుధవారం మూడవ టౌన్ పరిధిలో జరిగింది. నగరంలోని గాయత్రినగర్ చెందిన షేక్ మెహబూబ్(49) గౌతంనగర్ నూతన భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 14, 2025

NZB: పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ మంగళవారం వర్చువల్‌గా  ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

News January 14, 2025

భీమ్‌గల్: సెల్ఫీ వీడియోపై స్పందించిన ఎస్ఐ

image

భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన తక్కూరి నికేష్ సెల్ఫీ వీడియోపై ఎస్ఐ మహేశ్ స్పందించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా పలుమార్లు స్టేషన్‌కు పిలిచినా రాలేదన్నారు. తప్పించుకు తిరుగుతూ పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో హింసించ లేదని, అతని ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ మేరకు ఎస్ఐ మహేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

News January 14, 2025

NZB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.