News December 31, 2024
NZB: విషాదం.. రెండంతస్తుల భవనంపై నుంచి పడి మహిళ మృతి
బట్టలు ఆరేయడానికి వెళ్లి భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు తెలిపారు. బోర్గాం(పి)కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 4, 2025
నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన: MLC కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని ఆమె నివాసంలో శుక్రవారం జాగృతి విద్యార్థి నాయకుడు మునుకుంట్ల నవీన్ రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్, భగవత్ యాదవ్, సునీల్ జోషి, రాజ్ కుమార్ యాదవ్, ఈశ్వర్ అజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
News January 4, 2025
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే: ఇన్‌ఛార్జి సీపీ
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే అని నిజామాబాద్ ఇన్‌ఛార్జి సీపీ సింధూ శర్మ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజల మనోభావాలకు భంగపర్చకుండా ప్రజల మన్ననలను పొందాలని ఆమె ట్రైనింగ్ పొందిన కానిస్టేబుళ్లకు సూచించారు.
News January 3, 2025
డిచ్పల్లి: 463 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
డిచ్పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో శుక్రవారం 463 మంది SCTPCs (TGSP)లకు 2024 “దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధూ శర్మ హజరయ్యారు. 9 నెలల శిక్షణలో నేర్చుకున్నది శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించాలని ఆమె సూచించారు. కమాండెంట్ పి.సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.