News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 27, 2026
NZB: సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News February 27, 2026
NZB: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైందని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, మార్చి13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. నేటి నుంచి మార్చి 4 వరకు https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.
News February 27, 2026
ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


