News January 7, 2026

NZB: సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది: CP

image

దివ్యాంగుల సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం నిర్వహించిన డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

Similar News

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.