News June 7, 2024
NZB: సహకార సంఘానికి తాళం వేసిన రైతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1717763562998-normal-WIFI.webp)
కోటగిరిలోని ఎత్తొండ గ్రామంలో రైతులకు రావాల్సిన రూ.1.80 కోట్ల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేశారు. సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగిలో పండించిన పంటను ఇచ్చి 2 నెలలు అవుతున్నా వారికి డబ్బులు చెల్లించలేదని తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ సునీత, AO శ్రీనివాస్ వారికి రావాల్సిన డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 11, 2025
బాల్కొండ: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739263374597_50486028-normal-WIFI.webp)
బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్‌లను కలెక్టర్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.
News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739254490210_1043-normal-WIFI.webp)
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News February 11, 2025
జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739242161353_1043-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.