News August 22, 2025
NZB: సీసీ కెమెరాలపై స్ప్రే.. ATMలో చోరీకి యత్నం

నిజామాబాద్ చంద్ర శేఖర్ కాలనీలో ఈనెల 18న అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా అందులో ఉన్న నగదు కాలిపోయింది. దుండగులు ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News August 22, 2025
NZB: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి జిల్లా జట్లు

తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళా, పురుషుల జట్లు ఖరారయ్యాయి. ఇటీవల మహిళా, పురుషుల ప్రాబబుల్స్ జట్లకు సన్నద్ధ శిబిరం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్లు నేటి నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో జరిగే 71వ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
News August 22, 2025
బీజేపీ నిజామాబాద్ జిల్లా నూతన కమిటీ నియామకం

బీజేపీ జిల్లా నూతన కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్, బంటు రాము, రాంచందర్, సురేందర్, ప్రమోద్, పాలేపు రాజు, జిల్లా కార్యదర్శులుగా అనిల్, నర్సారెడ్డి, వేణు, జ్యోతి, రాధ, సవితను నియమించారు.
News August 21, 2025
డిచ్పల్లి: PG పరీక్షలను పరిశీలించిన TU రిజిస్ట్రార్

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలను TU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం 5వ రోజు పరీక్షల్లో భాగంగా ఉదయం పరీక్షకు 80 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.