News January 8, 2025
NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఏసీపీ
సైబర్ నేరాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం ఏసీపీ వెంకటేశ్వర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ మోసాల గురించి ఆయన ప్రస్తావించారు. వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ ఫోన్ లకు వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు.
Similar News
News January 9, 2025
కామారెడ్డి: కొడుకును కాపాడటానికి వచ్చి తండ్రి మృతి
కొడుకును కాపాడటానికి వెళ్లిన తండ్రి రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాగిర్తి పల్లికి చెందిన పెద్ద నర్సింలు కుమారుడు మంగళవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో నర్సింలును రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 9, 2025
కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి
కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.
News January 9, 2025
NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.