News August 18, 2025

NZB: సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు నివేదికలు సమర్పించాలి

image

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News August 18, 2025

NZB: దొంగ ఎవరో మీరే తేల్చండి?

image

డిచ్‌పల్లి CMC మెడికల్ కాలేజ్ వ్యవహారంపై ఛైర్మెన్ షణ్ముఖ మహా లింగం సోమవారం NZB ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. CMCలో 4 నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను వివరించారు. IMA NZB అధ్యక్షుడిగా పరిచయమైన డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పని చేస్తున్న డాక్టర్ సుమంత్ చర్యలపై ఆరోపణలు గుప్పించారు. దొంగ ఎవరో మీరే తేల్చండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News August 18, 2025

NZB: ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ, ఏసీపీ పాల్గొన్నారు.

News August 18, 2025

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని NZBకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.