News January 21, 2025

NZB: స్కూలుకు వెళ్లమన్నందుకు ఉరేసుకొని ఆత్మహత్య

image

స్కూలుకు వెళ్లమని తల్లి మందలించడంతో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి నగర్‌కు చెందిన దామెర సాక్షిత్ రెడ్డి(14) 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు సరిగా వెళ్లలేక పోవడంతో ఉదయం తల్లి స్కూల్‌కి వెళ్లాలని మందలించి విధులకు వెళ్లింది. ఇంటికి వచ్చి చూసేసరికి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 11, 2025

₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.

News November 11, 2025

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ VC

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్, పీడీ హౌసింగ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు