News March 28, 2025
NZB: స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా

స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. బీమా సౌకర్యం వివరాలను స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ తెలియజేయాలన్నారు.
Similar News
News July 10, 2025
NZB: ఫోక్ డాన్సర్ జానూ లిరి సందడి

ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
News July 9, 2025
NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.