News January 5, 2026
NZB: హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

నిజామాబాద్‌లోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన భైరగోని సతీశ్ గౌడ్‌కు హత్య కేసులో ఊరి శిక్ష విధిస్తూ NZB 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. నాగారానికి చెందిన కండెల సందీప్‌ను 2025 ఫిబ్రవరిలో ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అభియోగాలు రుజువు కావడంతో ఉరి శిక్ష పడింది. మరో 2 నేరాల్లో 7, 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
Similar News
News January 8, 2026
హైటెక్ బరులు.. విజేతలకు బ్రెజా, థార్ కార్లు

AP: సంక్రాంతి కోడి పందేలకు నూజివీడు, గన్నవరం సరిహద్దుల్లో 28 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ బరులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నిరంతరాయంగా పందేలు ఉంటాయంటూ ప్రముఖులకు ఆహ్వానపత్రికలూ అందజేస్తున్నారు. వీఐపీల కోసం 80 మంది బౌన్సర్లను రప్పిస్తున్నారు. రోజుకు రూ.కోట్ల పందేలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విజేతలకు బ్రెజా, థార్ కార్లను బహుమతులుగా ప్రకటించారు.
News January 8, 2026
విశాఖకు చెందిన యూట్యూబర్ అరెస్ట్

పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్లోడ్ చేస్తున్న విశాఖ విశాలక్షినగర్‌కు చెందిన యూట్యూబర్ కంబేటి సత్యమూర్తి(39)ని HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. తన వీడియోల్లో 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలను అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ.. లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News January 8, 2026
మార్చి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి!

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 24 అంతస్తుల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.1,100 కోట్ల వ్యయంతో L&T సంస్థ చేపట్టిన నిర్మాణ పనులు మార్చిలో పూర్తి కానున్నాయి. మరోపక్క రూ.140 కోట్లతో 24 అంతస్తుల్లో కరెంట్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. 3 జనరేట్లర్లు, 42 లిఫ్టుల్లో 32 లిఫ్టులను పూర్తి చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు 3 ట్రాన్స్ ఫార్మర్లను బిగించారు. ఏప్రిల్ మొదటి వారంలో సీఎం ప్రారంభించనున్నారు.


