News March 20, 2024
NZB: ‘హై కోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు’

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.
Similar News
News April 19, 2025
NZB: మద్యం తాగుతూ.. పాటలు వింటూ మృతి(UPDATE)

నగరంలోని సుభాష్ నగర్లో ఆటోలో మృతి చెందిన వ్యక్తిని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలచందర్(36)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో పాటలు వింటూ మద్యం సేవిస్తుండగా ఒకసారిగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు.
News April 19, 2025
NZB: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాల్లో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఏర్పడితే వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చన్నారు.
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్‌లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.