News March 9, 2025

NZB: 10 నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

మార్చి 10వ తేదీ నుంచి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులను వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లు రిలీవ్ చేయాలని ఆయన ఆదేశించారు.

Similar News

News February 28, 2026

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

image

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.