News August 27, 2024
NZB: 11 మంది నేషనల్ అథ్లెటిక్స్ మెడల్ విజేతలకు క్యాష్ అవార్డు

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన 11 మంది విజేతలకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శీను నాయక్ క్యాష్ అవార్డులు అందజేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్‌లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన 11 మంది కలిసి మొత్తం 17 మెడల్స్ సాధించారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన విధంగా నగదును జిల్లా విజేతలకు అందజేశారు.
Similar News
News November 4, 2025
పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: NZB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు.
News November 4, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
News November 4, 2025
NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.


