News December 11, 2025
NZB: 11 గంటల వరకు 50.73 శాతం పోలింగ్

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 11 మండలాల్లోని 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
బోధన్ మండలంలో 62.34%,
చందూరు-48.54%
కోటగిరి- 48.12%
మోస్రా-38.22%
పోతంగల్- 53.03%
రెంజల్- 58.93%
రుద్రూరు-55.85%
సాలూర- 55.95%
వర్ని- 54.91%
ఎడపల్లి-47.58%
నవీపేట – 37.77% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
Similar News
News December 13, 2025
NZB: 2వ విడత.. 38 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం

ఆదివారం జరగబోయే 2వ విడత GPఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 568 మంది బరిలో నిలిచారన్నారు.
News December 12, 2025
నిజామాబాద్: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నిక గురువారంతో ముగిసింది. రెండో విడతలో భాగంగా ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముగ్పాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.
News December 12, 2025
NZB: మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2,63,016 క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.


