News April 24, 2024
NZB: ‘1200 మంది పోలీసులతో బందోబస్తు’

ఈ నెల 23న నిర్వహించే హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు 1200 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడువున CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ నుంచి వాహనాల దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
NZB: అజారుద్దీన్ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.
News November 10, 2025
నిజామాబాద్లో కూరగాయల ధరల వివరాలు..!

నిజామాబాద్ లో కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.20 కేజీ, వంకాయ రూ.35, బెండకాయ బీరకాయ, దొండకాయ రూ.50, చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.25, కాలిఫ్లవర్ రూ.50, మిరపకాయ రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ, బెండకాయ రూ.50, దొండకాయ రూ.50, పాలకూర రూ.50, తోటకూర రూ.30, గోరుచిక్కుడు రూ.50, మునగా కాయ రూ.70, ఉల్లిగడ్డ రూ.100కు ఐదు కేజీలు, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50లకు కేజీ ధర పలుకుతున్నాయి.
News November 8, 2025
KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


