News March 11, 2025
NZB: 14 మంది సీఐల బదిలీ

మల్టీజోన్-1 పరిధిలో 14 మంది CIలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CCS నిజామాబాద్‌కు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న రవి కుమార్, NIB నిజామాబాద్‌కు PCR కామారెడ్డి నుంచి జి.వెంకటయ్యను బదిలీ చేశారు. కాగా బదిలీ అయిన 14 మంది సీఐల్లో అధిక శాతం మంది వెయిటింగ్‌లో ఉన్నవారే ఉన్నారు.
Similar News
News March 11, 2025
సాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: కలెక్టర్

ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అన్వేషించాలని వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే యాసంగిలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరచాలన్నారు.
News March 11, 2025
NZB: పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ: కలెక్టర్

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పసుపు పంట విక్రయాలపై లోతైన పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా, మోసాలకు గురికాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పసుపు క్రయవిక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు అండగా ఉండాలన్నారు.
News March 11, 2025
NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.