News March 11, 2025
NZB: 14 మంది సీఐల బదిలీ

మల్టీజోన్-1 పరిధిలో 14 మంది CIలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CCS నిజామాబాద్‌కు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న రవి కుమార్, NIB నిజామాబాద్‌కు PCR కామారెడ్డి నుంచి జి.వెంకటయ్యను బదిలీ చేశారు. కాగా బదిలీ అయిన 14 మంది సీఐల్లో అధిక శాతం మంది వెయిటింగ్‌లో ఉన్నవారే ఉన్నారు.
Similar News
News April 13, 2026
నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2026
నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.


