News February 1, 2025

NZB: 14.5 తులాల బంగారం చోరీ

image

సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Similar News

News March 14, 2025

ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 14, 2025

నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ

image

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News March 14, 2025

మంచిర్యాల: వైద్యారోగ్య శాఖలో ఖాళీలు

image

మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నెల 15 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ హరీశ్ రాజ్ తెలిపారు. వైద్య అధికారి, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

error: Content is protected !!