News March 11, 2025

NZB: 14 మంది సీఐల బదిలీ

image

మల్టీజోన్-1 పరిధిలో 14 మంది CIలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CCS నిజామాబాద్‌కు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న రవి కుమార్, NIB నిజామాబాద్‌కు PCR కామారెడ్డి నుంచి జి.వెంకటయ్యను బదిలీ చేశారు. కాగా బదిలీ అయిన 14 మంది సీఐల్లో అధిక శాతం మంది వెయిటింగ్‌లో ఉన్నవారే ఉన్నారు.

Similar News

News March 11, 2025

నిజామాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మెండోరా మండలం వెల్గటూర్‌కు చంద్రగిరి వెంకటేశ్(39) ఆర్థిక నష్టాలతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ నారాయణ తెలిపారు. వెంకటేష్ ఉపాధి కోసం మూడు సార్లు దుబాయ్ వెళ్లొచ్చాడని చెప్పారు. వెల్గటూర్ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News March 11, 2025

NZB: కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్: కవిత

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ సర్కారు మనిషికి 2.5లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

News March 11, 2025

NZB: నూతన సీపీ సాయి చైతన్య నేపథ్యమిదే

image

2016 బ్యాచ్‌కు చెందిన సాయి చైతన్య ఐఐటీ బెనారస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నిజామాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. గతంలో కాటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు.

error: Content is protected !!