News April 19, 2024

NZB: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

Similar News

News January 11, 2025

NZB: ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జ్ CP

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జ్ సీపీ సింధూ శర్మ శనివారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయమన్నారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవనము గడపాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు.

News January 11, 2025

NZB: నిలకడ స్థాయికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత నిలకడ స్థాయికి చేరుకుంది. శనివారం కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా డోంగ్లి 13.1, జుక్కల్ 13.5, మేనూర్ 13.9, సోమూర్ 14.3, వేల్పుగొండ 14.6 ఉష్ణోగ్రతల నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 15.3, కోటగిరి 15.4, రుద్రూర్ 15.5,ఎర్గట్ల,సాలూర,మెండోరా,వలిపూర్ లలో 15.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News January 11, 2025

చింతకుంట అటవీ ప్రాంతంలో ఆవు పై చిరుత పంజా

image

మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజ్జి నారాయణ ఆవులు మేత మేయడానికి వెళ్లగా చిరుత ఆవుపై దాడి చేసింది. పెంపుడు కుక్కలు అరవడంతో ప్రాణాలతో బయట పడ్డట్టు బాధితుడు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్టు గతంలో గుర్తించినట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ హుస్సేన్ తెలిపారు. కాపరులు గుట్ట పైకి వెళ్ల కూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.