News April 19, 2024

NZB: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

Similar News

News April 20, 2025

NZB: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి: సీపీ

image

భవనాలు, పరిశ్రమలు, పాఠశాలలు, దుకాణాల్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిజామాబాద్ ఫైర్​స్టేషన్​లో నిర్వహించారు. అనంతరం పదవీ విరమణ చేసిన లీడింగ్ ఫైర్​మెన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

News April 20, 2025

బోధన్ డంపింగ్ యార్డ్‌ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

image

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

News April 20, 2025

NZB: రేపు ప్రజావాణి రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్​లో​ నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!