News December 28, 2024

NZB: 2న జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌

image

ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌ జస్టిస్‌ షమీం అక్తర్‌ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్‌లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News December 29, 2024

రెంజల్: ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము

image

రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడ పాము కనిపించడంతో ఉద్యోగులకు తెలిపారు. మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టె వారికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News December 29, 2024

నిజామాబాద్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి.సాయన్న

image

నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు జిల్లా సీఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డీఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు వచ్చారు.

News December 29, 2024

బోధన్: కోదండరామ్‌ను కలిసిన కార్మికులు

image

బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.