News June 5, 2024

NZB: 2 సార్లు MLA..ఎంపీ పోటీలో డిపాజిట్ గల్లంతు..!

image

నిజామాబాద్ లోక్ సభ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తాచాట లేకపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు MLA గా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. తిరిగి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆయనకు 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8.3% ఓట్లు రాబట్టగా.. డిపాజిట్ కూడా గల్లంతైంది.

Similar News

News January 4, 2026

నిజామాబాద్: 102 కేసులు నమోదు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.

News January 4, 2026

నిజామాబాద్: రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న జిల్లా మహిళలు

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బుగ్గలి రజక స్వప్న(కులవృత్తిలో సేవలు), సురుకుట్ల ఝాన్సీ (వ్యాపార రంగం) తమ రంగాల్లో చూపిన ప్రతిభకు అవార్డులను అందుకున్నారు. ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, కమిటికీ కృతజ్ఞతలు తెలిపారు.

News January 4, 2026

టర్కీలో గుండెపోటుతో వేల్పూర్ వాసి మృతి

image

వేల్పూర్ గ్రామానికి చెందిన జెల్లా ప్రవీణ్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. బతుకుతెరువు కోసం టర్కీ దేశానికి వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. కొద్దరోజులకే అతడు మృతి చెందడంతో కుటుంబంలో విషదం నెలకొంది. కాగా అక్కడి నుంచి మృతదేహం రావాల్సి ఉంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.