News February 14, 2026

NZB: 2020లో 28.. 2026లో 28 సీట్లే

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి 2020 ఎన్నికల్లో 28 సీట్లు వచ్చివచ్చాయి. అయితే ప్రస్తుత 2026 ఎన్నికల్లో కూడా 28 సీటు రావడం గమనార్హం. గత ఎన్నికల్లో 28 సీట్లతో కార్పొరేషన్‌లో లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 12 సీట్లు గెలిచిన BRS 18 మంది MIM, ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ కార్పోరేటర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో?

Similar News

News February 14, 2026

NZB: 16న మేయర్ ఎన్నిక కోసం ఏర్పాట్లు

image

ఈ నెల 16న (సోమవారం) నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. NZB ACP ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కాగా మొదట మేయర్ ఎన్నిక జరుగుతుంది. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎంపిక ఉంటుంది.

News February 14, 2026

NZB: మేయర్ బరిలో బీసీ అభ్యర్థులు..!

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.

News February 14, 2026

దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

image

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.