News November 19, 2024

NZB: 2024 – 25 సంవత్సరానికి మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు విడుదల

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను పెండింగ్, రెగ్యులర్ బిల్లులు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా సిసిహెచ్‌ల గౌరవ వేతనం రూ.2వేలకు గాను రూ.1,31,24,000 బడ్జెట్‌ను మండలాల వారీగా విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు సీసీహెచ్‌ల గౌరవవేతనాన్ని విడుదల చేయాలని ఆదేశించామన్నారు.

Similar News

News March 13, 2026

NZB: 398 మంది విద్యార్థులు గైర్హాజరు

image

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 398 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,119 మంది విద్యార్థులకు గాను 15,721 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,085 మంది విద్యార్థులకు గాను 13,783 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,034 మంది విద్యార్థులకు గాను 1,938 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు.

News March 13, 2026

NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News March 12, 2026

నిజామాబాద్ GGHలో వరల్డ్ కిడ్నీ డే

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లోని డయాలసిస్ కేంద్రంలో గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాస్ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆహార నియమాలు పాటించాలని సూచించారు. డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.