News January 12, 2026

NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.

Similar News

News February 18, 2026

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

image

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.

News February 18, 2026

నిజామాబాద్‌లో టమాటా ధర ఎంతంటే?

image

నిజామాబాద్‌లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్‌సేల్‌లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.