News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.
Similar News
News December 1, 2025
NZB: పార్లమెంట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MPఅర్వింద్ ధర్మపురి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
News December 1, 2025
NZB: రెండో దశ తొలి రోజు 270 నామినేషన్లు

NZB జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో NZB డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.


